
‘‘తాళాలు ఎక్కడ పెట్టాను?’’... ‘‘సరే, ఇప్పుడు ఏం చేయాలి’’... ‘‘అయ్యో, పాలు కొనడం మర్చిపోవద్దు’’ ఇలా మీలో మీరు గట్టిగా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయా? ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు
నిపుణులు. చాలామంది దీన్ని వింత అలవాటుగా భావించినా మెదడు పనితీరులో ఇది సహజమైన భాగమని చెబుతున్నారు. అంతేకాదు మీతో మీరే మాట్లాడుకోవడం ఏకాగ్రతను పెంచడంలో, పనులను సులభంగా పూర్తి చేయడంలో సాయపడొచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.గొంతులోనే దాగిన సైన్స్మనసులో ఆలోచించడం ఒకటి అయితే, అదే విషయాన్ని గట్టిగా పలకడం మరోటి. బ్రిటన్లోని బాంగోర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధనలో పాల్గొన్న వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. కొందరిని వాటిని మనసులో చదవమన్నారు. మరికొందరిని గట్టిగా చదవమన్నారు. ఆ తర్వాత వారితో ఓ పని చేయించారు. గట్టిగా చదివిన వారు పనిని మరింత సమర్థంగా పూర్తి చేసినట్లు గుర్తించారు. మనం చెప్పుకొన్న మాటలను మనమే వినడం వల్ల మెదడు ఆ సూచనలను మరింత స్పష్టంగా స్వీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు.వెతకడంలో కూడా ఉపయోగమేఏదైనా వస్తువు కనిపించకపోతే ‘‘తాళాలు... తాళాలు...’’ లేదా ‘‘ఫోన్ ఎక్కడ?’’ అంటూ వెతికే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది కూడా ఉపయోగకరమేనని మరో అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని కొన్ని వస్తువులను గుర్తించమన్నారు. వస్తువు పేరును గట్టిగా చెబుతూ వెతికిన వారు దాన్ని వేగంగా గుర్తించారు. అంటే మాటల రూపంలో మెదడుకు సంకేతం ఇవ్వడం వల్ల కళ్ల దృష్టి కూడా ఆ వస్తువుపైనే