గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ నిరాశలో మునిగిపోయిన టాలీవుడ్లో ఇప్పుడు మళ్లీ ఒక సరికొత్త ఊపు, పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.
జనవరిలో సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత థియేటర్ల వద్ద మళ్లీ ఆ స్థాయి సందడి పెద్దగా కనిపించలేదు. అయితే జూన్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త కళను తీసుకొచ్చింది. ఒకదాని వెనుక ఒకటిగా వరుస చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తూ ప్రేక్షకులను మళ్లీ సినిమా హాల్స్ వైపు అడుగులు వేయించేలా చేస్తున్నాయి.జూన్ చిత్రాల హవాఈ పాజిటివ్ మూమెంట్‌కు జూన్ మొదటి వారంలోనే పునాది పడింది. జూన్ 4వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో విడుదలైన ‘ పెద్ది ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రెండు వారాల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లతో రామ్‌చరణ్ కెరీర్లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మ్యూజికల్ స్టోరీ ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో తక్కువ మంది చూసినప్పటికీ, చూసిన ప్రతి ఒక్కరి నుండి లభించిన అద్భుతమైన పాజిటివ్ టాక్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చింది.* శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య, ముంబై యోగా ఈవెంట్లో అసలేం జరిగింది? ఇక జూన్ మూడో వారంలో థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటానికి ప్రధాన కారణం సమంత నటించిన ‘ మా ఇంటి బంగారం ’. సమంత ప్రధాన పాత్రలో నటించి నిర్మించి ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా జూన్ 19న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఫ్యాన్స్ నుంచి వస్తున్న భారీ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సమంత రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. మొత్తం మీద జూన్ నెల టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో సరికొత్త ఆశలను, ఆనందాన్ని నింపింది. ఆశలన్నీ అఖిల్ ‘లెనిన్’ పైనేజూన్ నెల ఇచ్చిన ఈ క్రేజీ మూమెంట్ ఇలాగే కొనసాగితే టాలీవుడ్‌కు తిరుగుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ అఖిల్ అఖినేని ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పవర్ఫుల్ పొలిటికల్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్'. రాయలసీమ (చిత్తూరు) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. వాస్తవానికి ఈ పాత్రకు తొలుత శ్రీలీలను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలోకి భాగ్యశ్రీ వచ్చింది. ప్రముఖ నటుడు శివాజీ, శరణ్య ప్రదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.* తెలుగు అక్షరాలు చూస్తే జిలేబీలు గుర్తొస్తాయి.. నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'సోల్ ఆఫ్ లెనిన్' (Soul of Lenin) వీడియో సాంగ్‌కు సోషల్ మీడియాలో, ప్రేక్షకులలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను జూన్ 26నే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ విజువల్స్, అవుట్‌పుట్ మరింత క్వాలిటీగా, పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో కొద్దిరోజులు వాయిదా వేసి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి లైనప్ చేశారు. ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఉన్న పాజిటివ్ ట్రెండ్‌ను అఖిల్ 'లెనిన్' కంటిన్యూ చేసి హిట్ టాక్ తెచ్చుకుంటే.. అది అఖిల్ కెరీర్‌కే కాకుండా, అక్కినేని అభిమానులకు ఉన్న పెద్ద లోటును తీరుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.