
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కేసు నేపథ్యం ఇదే! డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్లో 'పుష్ప 2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఒకేసారి పోటెత్తడంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి (39) అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తగిన భద్రతా అనుమతులు తీసుకోకపోవడం, పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, మేనేజర్లను A1 నుంచి A10 నిందితులుగా పేర్కొనగా.. నటుడు అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడు)గా చేర్చారు.
గతంలో (డిసెంబర్ 13, 2024న) ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్, ఆ తర్వాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ పొందారు.
నేటి విచారణపై సస్పెన్స్! ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి కోర్టు, జూన్ 22న (నేడు) విచారణకు స్వయంగా హాజరుకావాలని అల్లు అర్జున్ సహా మరో 19 మందికి సమన్లు పంపింది. అయితే అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా? లేదా అనేదానిపై రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నేరుగా నాంపల్లి కోర్టుకు రావడం. ఒకవేళ నిందితులంతా హాజరైతే నేటి నుంచి ట్రయల్ (న్యాయ ప్రక్రియ) ప్రారంభమవుతుంది. తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేసి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం వంటి జరగొచ్చు.
"సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. దీనికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని అల్లు అర్జున్ లీగల్ టీమ్ పేర్కొంది. దీంతో ఐకాన్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కుతారా లేక చట్టపరమైన ఇతర మార్గాలను ఎంచుకుంటారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.