
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆది వారం రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యా ప్తంగా 185 కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాల్లో నిర్వహణ
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పునఃపరీక్ష ఆది వారం రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యా ప్తంగా 185 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. రాష్ట్రం నుంచి 65,790 మంది విద్యార్థులు నీట్ రీటెస్ట్‌ను రాసేందు కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో దాదాపు 59 వేల మంది (సుమారు 90 శాతం) పరీక్ష రాశారు. గత నెల నిర్వహించిన పరీక్షకు రాష్ట్రంలో ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో, ఇప్పుడు నిర్వహించిన రీటెస్టుకు కూడా దాదాపు అంతే మంది హాజరయ్యారు. ఓఎంఆర్ షీట్లను రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పంపిం చేందుకు సిద్ధమైంది.
పలుచోట్ల కొంత మంది విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు వచ్చారు. అధికారులను వేడుకున్నా.. అనుమతించక పోవడంతో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై వెనుదిరిగా రు. ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలోని పరీ క్షా కేంద్రానికి ఐదుగురు విద్యార్థులు లేటుగా రావడంతో వెనక్కి పంపించారు. అనంతపురంలో 5-10 నిమిషాల ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యా ర్థులు తమను పరీక్ష రాసేందుకు అనుమతించా లని కలెక్టర్‌ను వేడు కోవడం కనిపించింది. మరోవైపు శ్రీకాకుళంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వర్షం కురవడంతో అభ్యర్థులు ఇబ్బం దులు పడ్డారు. మధ్యాహ్నం 2కు పరీక్ష ప్రారంభం కాగా, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల కేంద్రంలో నీట్ పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి అస్వస్థతతకు గురయ్యాడు. తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన పిడపర్తి గౌతమ్ మధ్యా హ్నం 3.30 గంటల వరకు పరీక్ష బాగానే రాశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కడుపులో విపరీతమైన నొప్పితో బల్లపై పడిపోయాడు. సిబ్బంది వెంటనే అతన్ని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నంలో 18 కేంద్రాల్లో అభ్యర్థులను తనిఖీచేయడానికి పురుష, మహిళా బౌన్సర్లను నియమించారు.