
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా...
Jun 21 2026 9:54 PM | Updated on Jun 21 2026 9:56 PM
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు రెండు వందల టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. హర్మన్‌కు ఇది 10వ టీ20 వరల్డ్‌కప్ కావడం గమనార్హం.
కాగా మహిళల విభాగంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో హర్మన్(200) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్ సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. పురుషుల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) ఉన్నాడు.
అత్యధిక టీ20లు ఆడిన టాప్ ప్లేయర్స్ పురుషుల విభాగంలో: పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 163 మ్యాచ్‌లు (అగ్రస్థానం) రోహిత్ శర్మ (భారత్): 159 మ్యాచ్‌లు (రెండో స్థానం)
మహిళల విభాగంలో: హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్): 200 మ్యాచ్‌లు సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 184 మ్యాచ్‌లు ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్‌లు
కాగా తన కెరీర్లో హర్మన్ ఇప్పటివరకు ఆడిన 200 మ్యాచ్‌లలో 29.83 సగటుతో 4147 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఆమె 32 వికెట్లు పడగొట్టింది.
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..