
చాలామంది బరువు తగ్గడానికి లేదా ఫిట్నెస్ కోసం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే...
By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
చాలామంది బరువు తగ్గడానికి లేదా ఫిట్నెస్ కోసం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలోని అధిక ఆమ్లత్వం (Acidic nature) వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరగడం, గ్యాస్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు తీవ్రమవడం జరుగుతుంది. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కడుపులో మంట, ఎసిడిటీ: ఖాళీ కడుపుతో నిమ్మరసం నేరుగా తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి తీవ్రమైన కడుపు మంటకు దారితీస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. అల్సర్, గ్యాస్ట్రైటిస్ ఉన్నవారికి, సులభంగా జీర్ణ సమస్యలు వచ్చే వారికి ఇది మరింత హానికరం.
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ అందరి శరీర తత్వానికి పడకపోవచ్చు. ఎవరికైతే ఇప్పటికే గ్యాస్, చాతిలో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ (ఆమ్లాలు పైకి రావడం) వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయో, వారికి పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి.
దంతాల ఎనామిల్ దెబ్బతినడం: నిమ్మరసంలోని అధిక ఆమ్ల గుణం దంతాల పైపొర అయిన ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. దీనివల్ల దంతాలలో జివ్వున లాగడం (సెన్సిటివిటీ), పళ్ళు అరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కడుపు నొప్పి, తిమ్మిరి: కొందరి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగినప్పుడు పొట్టలో మలిపెట్టినట్లు ఉండటం, తీవ్రమైన కడుపు నొప్పి లేదా తిమ్మిరి వంటి అసౌకర్యాలు ఎదురవుతాయి.
అల్సర్, గ్యాస్ట్రైటిస్ ప్రమాదం: పొట్టలో అల్సర్లు (పుండ్లు) లేదా గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నవారికి ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది పొట్ట లోపలి గోడలను మరింత రేకెత్తించి నష్టాన్ని కలిగిస్తుంది.
డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత: నిమ్మరసానికి శరీరంలోని నీటిని బయటకు పంపే గుణం (Diuretic effect) ఉంటుంది. దీనిని అతిగా తీసుకోవడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. ఫలితంగా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..