
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కారులో వెళ్తున్న ఓ ఏడాది బాలుడు.. వాహనం నుంచి కిందపడటం కలచివేసింది.
సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
కోల్టన్లో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు.. కదులుతున్న వాహనం నుంచి బాలుడు ఎలా కింద పడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. అయితే, చనిపోయిన బాలుడు భారత సంతతికి చెందిన (ధన్విన్ చల్లా) వ్యక్తిగా తెలుస్తోంది. వీరి కుటుంబం శాన్ బెర్నార్డినో కౌంటీలో ఉంటున్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.