
హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది.
Jun 21 2026 5:33 PM | Updated on Jun 21 2026 5:37 PM
హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తనకు ఎలాంటి సపర్యాలు చేసిందో రాజ్ సోదరి శీతల్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)
'సమంత-రాజ్ పెళ్లయిన తర్వాత కొన్నిరోజుల తర్వాత వాళ్లింటికి వెళ్లాను. ఓరోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి కారణంగా నేను మంచం కూడా దిగలేని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ గ్రూప్‌లో నా గురించి మెసేజ్ పెట్టగా.. సమంత తాను వస్తున్నట్లు చెప్పింది. మందులు, నీళ్లు తీసుకుని తనే వచ్చింది. దుప్పట్లు లేకపోతే నాపై టవర్స్ కప్పింది. ఆ టైంకి సమంతకి చాలా పనులున్నాయి. ఉదయం షూటింగ్ ఉంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ బాధగా ఉంది'
'సమంత సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తర్వాతి రోజు సెట్‌కి వెళ్లాను. అప్పుడు సమంత చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించింది. బ్రేక్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. ఆమె ముఖంలోని ఆందోళన నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించింది. సినిమాలో ఆ సీన్స్ చూసినవాళ్లెవరికీ ఆమె అలసట గురించి తెలీదు. ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గురించి తెలీదు' అని శీతల్ రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)
మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు)
ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)
జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు)
‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు)
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..