
ఆ సాంగ్ విడుదలై 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. అప్పట్లో చిన్నా, పెద్ద తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఆ స్టార్ హీరో పాడిన పాట గురించి తెలుసుకోవాల్సిందే. కోలీవుడ్ స్టార్ హీర్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సుపరిచితమే. కానీ.. ధనుష్ మంచి సింగర్ అని మీకు తెలుసా.. ? అవును.. ధనుష్ మంచి సింగర్... అలాగే రచయిత కూడా. ఆయన పాడిన ఒక పాట యావత్ దేశవ్యాప్తంగా మారుమోగింది. అదే వై దిస్ కొలవెరి డీ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కేవలం 20 నిమిషాల్లోనే ఈ పాటను కంపోజ్ చేశారు. ఇక ఆరు నిమిషాల్లోనే ధనుష్ లిరిక్స్ పూర్తి చేశారు. తమిళ్, ఇంగ్లీష్ పదాలతో రూపొందించిన ఈ పాట అటు అమెరికా రేడియో స్టేషన్లలో సైతం మారుమోగింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్ లో 60 కోట్ల వ్యూస్ ఉన్నాయంటే ఈ సాంగ్ ఏ స్థాయిలో హిట్టైందో చెప్పక్కర్లేదు. వై దిస్ కొలవేరి సాంగ్.. 2012లో విడుదలైన 3 సినిమాలోనిది. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్, శృతి హాసన్ జంటగా నటించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే 2011 నవంబర్ 16న ఈ పాటను రిలీజ్ చేయగా.. కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
ఈ పాటను సులభంగా చిన్నా, పెద్ద తెగ పాడుకున్నారు. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ హైలెట్ కాగా.. ధనుష్ స్వయంగా ఆలపించారు. విడుదలైన కొద్ది రోజులకే ఈ పాట యూట్యూబ్ మోస్ట్ పాపులర్ పాటగా గుర్తించింది. ప్రేమలో విఫలమై, హృదయం విరిగిపోయి బాధలో ఉన్న యువకుడి మనస్తత్వాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని భావిస్తారు. వై దిస్ కొలవెరి డీ అంటే.. ఇంత ఘోరమైన కోపం ఎందుకు అనే అర్థం అని అనిరుధ్ గతంలో వెల్లడించారు. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..