
ఢిల్లీలో పార్కింగ్ వివాదం. కత్తిపోట్లతో మహిళ దారుణ హత్య. భర్తకు ఆస్పత్రిలో తీవ్ర చికిత్స. Delhi Parking Dispute: మీరు పార్కింగ్ సినిమా చూశారా? చిన్న పార్కింగ్ విషయంలో ఏకంగా చంపుకునే వరకు వెళతారు.
ఇలాంటివి నిజంగా జరుగుతాయా అనుకున్నారు చాలా మంది, కానీ, అలాంటి సంఘటనే నిజంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ద్విచక్రవాహనం పార్కింగ్(Delhi Parking Dispute) వివాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొనగా, ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచింది. నైరుతి ఢిల్లీలోని బిందాపుర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. Bandi Bhagirath Bail: పోక్సో కేసులో బండి భగీరథకు బెయిల్. అసలు విషయం ఏంటంటే, బిందాపుర్లో నివసించే ఆర్తి, విక్కీ దంపతులకు, వారి పొరుగువారికీ బైక్ పార్కింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం మరోసారి వివాదం తలెత్తింది. మాట మాట పెరిగి అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో రెచ్చిపోయిన ప్రత్యర్థులు ఆ దంపతులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. పొట్ట, ఛాతి భాగాల్లో తీవ్రంగా పొడవడంతో వారు రక్తపు మడుగులో కూలబడ్డారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆర్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన విక్కీ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పప్పు (40), ఒక మైనర్‌గా గుర్తించారు. ఇప్పటికే పప్పును అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మైనర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.