
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shani Vakragati 2026 Effect On Zodiac: శని ప్రస్తుతం మీనరాశిలో సంచార దశలో కొనసాగుతోంది. దీని ఫలితంగా కొన్ని రాశులు అర్థాష్టమ శని ప్రభావంతో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ గ్రహం జూలైలో తన గమనాన్ని మార్చుకోబోతోంది.. ముఖ్యంగా జులై 27వ తేదీన శని వక్రగతిలోకి వెళ్ళబోతోంది. అయితే, ఇది డిసెంబర్ 11వ తేదీ వరకు ఇదే స్థితిలో కొనసాగుతుంది. దాదాపు 138 రోజులపాటు ఐదు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోబోతున్నాయి. గతంలో ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ వ్యక్తులందరికీ ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది.. అంతేకాకుండా జీవితంలో సమస్యలు పూర్తిగా తగ్గి మానసిక ప్రశాంతత లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, శని వక్రగతిలోకి వెళ్లడం కారణంగా ఏ రాశుల వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుందో? విశేషమైన లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు: కుంభరాశి శని వక్రగతిలోకి ప్రవేశించడం కారణంగా కుంభరాశి వారికి మంచి మంచి ఫలితాలు కలుగుతాయి.. 138 రోజులపాటు వీరికి నిలిచిపోయిన పనులన్నీ తిరిగి పూర్తవుతాయి. వృత్తి జీవితంలో గొప్ప పురోగతి లభించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వ్యక్తులందరికీ జీతాలు విపరీతంగా పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత చెక్కబడతాయి. ఇబ్బందులతో పాటు అశాంతి తొలగిపోయి.. ఉత్తమమైన సమయం లభించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు..
మీన రాశి మీన రాశి వారికి శని వక్రగతి ప్రభావంతో జూలై నెల నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపవడమే కాకుండా పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన ఉత్తీర్ణత సాధించబోతున్నారు. వృత్తిపరంగా పురోగతి లభించి.. భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలు అనుకూలంగా మారి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక వ్యాధులు ఈ సమయంలో నయమవుతాయి. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశి మేషరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ శని వక్ర దశ ప్రారంభం కాబోతున్న సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కొత్త ఉద్యోగాలు లభించడమే కాకుండా.. ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వారి కోరికలు నెరవేరి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహ ఉద్యోగుల అండతో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో మంచి రోజులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అశాంతి మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి..
సింహరాశి సింహరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ వక్రగతి కారణంగా 138 రోజులపాటు వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో పని బాధ్యతలు పెరిగి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.. కార్యాలయంలో ప్రతి ఒక్కరితో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే బాస్ అండదండలు లభించి మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. వ్యాపారాలు కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులందరికీ ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అత్యున్నతమైన సమయాన్ని గడపగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.