
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Meenakshi Natarajan on MP nomination rejected row: తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెట్రో పనులపై నిధులు వచ్చేలా చూడాలని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్ మెంట్ ఇచ్చేలా చూడాలని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అంతకు ముందు మేడిగడ్డ ప్రాజెక్ట్ వివాదంలో మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ అపాయింట్ ఇప్పించాలని కోరారు. ఈ క్రమంలో బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఏకీపారేస్తున్నారు. బీజేపీ సైతం అదే విధంగా కౌంటర్ లు ఇస్తుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల మధ్య ప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రాజుకుంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలే మీనాక్షీ నటరాజన్ పై ఉన్న కేసు గురించి బీజేపీకి ఉప్పందించారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ సైతం దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజాగా.. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్ నుంచి రాజ్య సభ స్థానంకు తన నామినేషన్ తిరస్కరణ వెనుకాల తెలంగాణ కాంగ్రెస్ హస్తం ఉందనడంలో నిజంలేదని తెల్చి చెప్పారు. ఇదంతా డైవర్షన్ రాజకీయాలు అంటూ కొట్టి పారేశారు. అంతే కాకుండా తనకు రాజ్య సభ స్థానం కోసం తెలంగాణ నుంచి ఎంపీలు రాజీనామాకు సిద్దమైపోయారని వస్తున్న వార్తలపై కూడా రియాక్ట్ అయ్యారు. తన కోసం తెలంగాణకు చెందిన నేతలు ఎంపీ పదవి వదులుకొవాల్సిన పనిలేదన్నారు.
తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తినని, తెలంగాణ నుంచి రాజీనామా చేయించినా తాను ఆ రాజ్యసభ స్థానాన్ని తీసుకోనన్నారు. అంతే కాకుండా తాను దాఖలు చేసి ఎంపీ నామినేషన్ ఈసీ అభ్యర్థిత్వంలో ఫార్మ్ 2 లో లీగల్ నోటీసుల్ని ప్రస్తావించాలని కాలమ్ లేదన్నారు. ఒక వేళ ఉంటే తాను ప్రస్తావించేదాన్ని అని క్లారిటీ ఇచ్చారు. దీన్ని నాంపల్లి కోర్టు సైతం విచారణకు తీసుకొలేదన్న విషయంను ప్రస్తావించారు. తమ పార్టీకి అందరికి అండగా ఉంటుదన్నారు.
మరోవైపు తనపై ఆరోపణలు చేసిన శ్రీలతకు కూడా తాను అండగా ఉన్నానని చెప్పారు. ఆమెకు గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. ఒక మహిళగా ఆమె సమస్యలు విన్నామన్నారు.ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడిని తొలగించామని గుర్తు చేశారు. కేసు ఉన్నంత మాత్రాన తన నామినేషన్ తిరస్కరణ కాలేదని స్పష్టం చేశారు.
తాను నామినేషన్ తిరస్కరణపై నిరుత్సాహపడలేదని మరల నామినేషన్ దాఖలు చేశానని దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని మీనాక్షీ నటరాజన్ తెల్చి చెప్పారు. బీజేపీ కావాలని సీట్ చోరీకి పాల్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం బీజేపీకి.. బీ టీమ్ గా మారిందన్నారు. అందువల్లే తన నామినేషన్ తిరస్కరించారని మీనాక్షి పేర్కొన్నారు.
Read more: Pawan kalyan: సీఎం రేవంత్‌కు మరో ఝలక్.!. హైదరాబాద్‌లో నూతన జనసేన పార్టీ ఆఫీస్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అసలు స్కెచ్ అదేనా..?..
మధ్య ప్రదేశ్ లో కనీసం సంఖ్యాబలం కూడాలేకపోయిన మూడో అభ్యర్థిని బరిలోకి దింపి బీజేపీ కుట్రలకు తెరతీసిందన్నారు. గతంలో జార్ఖండ్ లో కూడా సంఖ్యాబలం లేకుండానే బీజేపీ పోటీకి దిగిన విషయంను సైతం మీనాక్షీ నటరాజన్ గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.