టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ( Maa Inti Bangaaram )...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' ( Maa Inti Bangaaram ) థియేటర్లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. శుక్రవారం(జూన్ 19) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల వేట మొదలుపెట్టింది. ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ‘బ్లాక్‌బస్టర్ బంగారం’గా నిలిచింది. ఫస్ట్ డే 13 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండోరోజు మరింత ఎక్కువగా రూ.15 కోట్ల రాబట్టడం విశేషం. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం, విడుదలైన రెండు రోజుల్లోనే సినిమా సేఫ్ జోన్లోకి ప్రవేశించి లాభాల బాట పట్టడం టాలీవుడ్లో సరికొత్త సంచలనంగా మారింది. సమంత మార్కెట్ వాల్యూ, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఈ ఫిగర్సే నిదర్శనమని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.* ఆ హీరో ప్రవర్తనకు కోపమొచ్చింది.. అడ్వాన్స్ ఇవ్వకుండానే వచ్చేశా: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక వైవిధ్యమైన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో స్వర్ణ (సమంత) అనే అనాథ యువతి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అనిరుధ్ (దిగంత్ మాంచాలే) అనే డాక్టర్‌ను పెళ్లాడుతుంది. అత్తింటికి ఒక అద్భుతమైన కోడలిగా మారి అందరి మనసులు గెలవాలని ఆమె ఆశపడుతుంది. అయితే స్వర్ణకు ఒక భయంకరమైన, హింసాత్మకమైన గతం ఉంటుంది. ఆ గతం కారణంగా ఆమె అత్తింటి కుటుంబానికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వర్ణ శత్రువులపై ఎలా తిరగబడింది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా సాగుతుంది. సమంత విశ్వరూపంసినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సెంటిమెంట్ సీన్స్‌లోనూ జీవించేసింది. ఈ భారీ సక్సెస్‌పై సామ్ సోషల్ మీడియాలో ఎంతో ఎమోషనల్ అవుతూ.. "మొదటి రోజే ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మా టీమ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. పెద్దగా కమర్షియల్ హీరోలు లేకపోయినా ప్రేక్షకులు కథను నమ్మి ఇంతగా ఆదరించడం ఆనందంగా ఉంది. థియేటర్లకు మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడం సినీ పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనం. మా చిన్న ప్రొడక్షన్ హౌస్ అనుకున్నది సాధించింది.. ట్రా-లా-లా...." అంటూ ట్వీట్ చేశారు.* సమంత సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన ‘జూనియర్ సూర్యకాంతం’ఈ చిత్రంలో విలన్‌గా గుల్షన్ దేవయ్య భయపెట్టగా.. గౌతమి, దిగంత్, శ్రీముఖి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి కామెడీ టైమింగ్, సామ్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాపు బొమ్మల శైలిలో డిజైన్ చేసిన టైటిల్ కార్డ్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై సమంత, హిమాంక్ దువ్వూరులతో కలిసి రాజ్ నిడిమోరు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.