
AP EAPCET-2026 ఫలితాలపై విద్యార్ధులకు కీలక అప్డేట్. ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్ధులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ఫలితాలు తొలుత ఈ నెల 1వ తేదీనే విడుదల చేస్తారని భావించారు.
అయితే, విడుదల ఆలస్యం అవుతోంది. ఇందుకు అధికారులు స్పష్టమైన కారణాలను వెల్లడించారు. దీంతో, ఇప్పుడు ఫలితాల విడుదల కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు.ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలపై కీలక సమాచారం అందుతోంది. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రిజల్ట్స్ వాయిదా పడటంతో మరికొంత కాలం ఎదురుచూడక తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 1న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల నిబంధనల ప్రకారం, ఈఏపీసెట్ ర్యాంకును కేటాయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్ష మార్కులను మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!ఫలితాల వెల్లడి దిశగా కసరత్తుర్యాంకులు కేటాయించాలంటే ఇంటర్మీడియట్‌ మార్కులూ తప్పనిసరి. పైగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సెకండ్‌ ఇంటర్‌ విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అవకాశం కల్పించింది. లక్షకుపైగా విద్యార్థులు తమ మార్కుల మెరుగుదలకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌ ర్యాంకుల్లో వీరికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫలితాలను వాయిదా వేసింది. జూన్‌ 18న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే, ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. సీబీఎస్‌ఈ రివైడ్జ్‌ ఫలితాలను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో, సీబీఎస్‌ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదలైన తర్వాత ఈఏపీసెట్‌ ర్యాంకులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.