
ఇంటర్నెట్‌డెస్క్: శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vibhav suryavanshi) విధ్వంసం సృష్టించాడు. బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు.
కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. అతడు (Vibhav suryavanshi) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అత్యధిక సమయం బౌండరీ బయటే ఉందంటే అతిశయోక్తి కాదు. షిరాజ్ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు పిండాడు.
కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు సాధించాడు. అయితే, సహన్ బౌలింగ్‌లో 8.5వ బంతికి వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శతకం ముందు ఔటయ్యాడని ఫ్యాన్స్ బాధపడ్డా.. శ్రీలంకను ఆదిలోనే బలమైన దెబ్బకొట్టాడు. అతడి (Vibhav suryavanshi) ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయంటే విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రియాంశ్ 39 పరుగులు చేసి దుల్జ్ బౌలింగ్‌లో వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకొన్నాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్, రుతురాజ్ ఉన్నారు. భారత్-ఎ 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.