
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్న సీఎం..
నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాలని డిసైడ్ అయిన రేవంత్.. తాజాగా కిషన్ రెడ్డికి లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. కిషన్ రెడ్డి స్పందన ఇప్పుడు కీలకంగా మారుతోంది.సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలోనే కిషన్ రెడ్డి కి మరో లేఖ రాసారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్‌రెడ్డిని కోరారు. మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు సంబంధించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా జోక్యం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 16న రాసిన లేఖనూ తాజా లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22, 23 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వస్తున్నానని, ఈ సందర్భంగా రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ నగరం, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యంఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని లేఖలో పేర్కొన్నారు.నన్నే గెలుకుతారా, 29 బంతుల్లో ఊచకోత - వైభవ్ రివేంజ్..!!మెట్రో ప్రాజెక్టు పై రేవంత్ కసరత్తుఅశ్వినీ వైష్ణవ్‌కు మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరిస్తానని, చర్చలకు అవసరమైన.. సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని తెలిపారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని ఆ వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్‌రెడ్డిని కోరారు. ఇప్పటికే కిషన్ రెడ్డి లక్ష్యంగా రేవంత్ చేస్తున్న వరుస వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. కిషన్ రెడ్డి సైతం తన పైన చేసిన విమర్శల కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఎలాంటి నిధులను అడ్డుకోలేదని.. తెలంగాణ విషయంలో తన చిత్తశుద్ది పైన అపోహలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రాసిన లేఖ విషయం లో కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు.. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కీలకంగా మారుతోంది.