
హైదరాబాద్ : మరో ఐదు రోజుల్లో కుమారిడి పెళ్లి. వివాహ ఏర్పాట్లు పూర్తి చేసుకొని బంధువులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
చుట్టాలకు పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘన వనపర్తి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి మండలం మెంటేపల్లికి చెందిన వెంకటయ్య(48) కొడుకు ఉదయ్ కుమార్ వివాహం ఈ నెల 25 న ఖాయం చేసుకున్నారు.
ఈ క్రమంలో బంధువులకు పెండ్లి పత్రికలు ఇచ్చేందుకు బైక్పై వెంకటయ్య వెళ్తుండగా పెబ్బేరు వద్ద జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఢీకొనడతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శృతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వెంకటయ్య మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.