
భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూడు భారతీయ జెండా కలిగిన భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.
6 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ఈ నౌకలు ప్రస్తుతం భారత ఓడరేవుల వైపు ప్రయాణిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఈ జలమార్గంలో రవాణా తిరిగి ప్రారంభం కావడం భారత్‌కు శుభపరిణామం.ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. 'దేశ్ వైభవ్', 'దేశ్ విభోర్', 'సన్మార్ హెరాల్డ్' అనే మూడు నౌకలు 94 మంది భారత సిబ్బందితో హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు ఆయన తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోదీ గారి నిర్ణయాత్మక నాయకత్వంలో భారత ప్రభుత్వం దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. మన నావికుల భద్రత, దేశ ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణ కోసం మా మంత్రిత్వ శాఖ అన్ని సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది" అని సోనోవాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ మూడు నౌకలు జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత తీరానికి చేరుకోనున్నాయి. 'దేశ్ వైభవ్' జూన్ 24న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు, 'దేశ్ విభోర్' అదే రోజున సిక్కా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఇక జూన్ 20న హర్మూజ్ జలసంధిని దాటిన 'సన్మార్ హెరాల్డ్'