
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లంక ప్లేయర్లకు వైభవ్ సూర్యవంశీకి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరి దృష్టి వైభవ్పైనే ఉంది. మరోవైపు ఈ సిరీస్‌లో వైభవ్ స్వల్ప పరుగులకే ఔట్ అవుతూ వచ్చాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గె, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్
నిరోషాన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, నువానిదు ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగే(కెప్టెన్), రవిందు ఫెర్నాండో, వానుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియస్కాంత్, దులాజ్ సముదితా, కుగాతస్ మిథులాన్
అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్: భారత్ క్లీన్‌స్వీప్