
ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని, ఇది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆరోగ్యకరమైన బహుమతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల కన్నతల్లి లాంటి భూమి విషతుల్యంగా మారుతోందని, ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మన ఉత్పత్తుల నాణ్యతపై ప్రభావం చూపుతోందని, అందుకే ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.పురుగుమందుల అవశేషాలు ఉండటమనే కారణంతో ఇటీవల గుంటూరు నుంచి పంపిన మూడు మిర్చి కంటైనర్లను చైనా దేశం తిప్పి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని, ఇది రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. ఉమ్మడి గుంటూరు నుంచి వాణిజ్య పంటలు, రాయలసీమ నుంచి ఉద్యాన ఉత్పత్తులు, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆక్వా ఉత్పత్తులు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, వీటికి మంచి ధర లభించాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని సూచించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే ఎరువులు, మందులు వాడాలని, భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, దీనికి గుర్తింపుగా స్విట్జర్లాండ్ నుంచి ‘ప్లానెట్ ఫుడ్ ప్రైజ్’ కూడా లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి