శనివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో, భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలి ఓవర్లోనే ఎదురుదాడికి దిగింది.
ఏకంగా రికార్డు స్థాయిలో తొలి ఆరు బంతుల్లో 23 రన్స్ రాబట్టింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో తమ అత్యధిక తొలి ఓవర్ స్కోరు నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ 219 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే అప్ఘాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ పదే పదే పిచ్‌లోని సురక్షిత ప్రాంతంలోకి పరుగెత్తాడు. దీంతో అంపైర్లు.. ఆ జట్టుకు 5 రన్స్ పెనాల్టీగా విధించారు. దీంతో టీమిండియా 5/0 స్కోరుతో తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇక భారత బ్యాటర్లు మరో 18 రన్స్ చేయడంతో 22 ఏళ్ల తర్వాత వన్డే క్రికెట్లో ఓ ఓవర్లో తమ అత్యధిక స్కోరును టీమిండియా నమోదు చేసింది.ఒక వన్డే ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భారత్ చేసిన అత్యధిక పరుగులు23 vs అఫ్ఘానిస్థాన్, చెన్నై, 202622 vs బంగ్లాదేశ్, కొలంబో, 200420 vs ఆస్ట్రేలియా, సిడ్నీ, 2020భారత్ ఛేజింగ్‌కు దిగినప్పుడు పాకిస్థాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. అతడే తొలి ఓవర్ వేశాడు. భారత్ 5/0తో ఇన్నింగ్స్ ప్రారంభించగా, జైశ్వాల్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. తొలి బంతి డాట్ అయింది. రెండో బంతి వైడ్ కాగా.. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫోర్ కొట్టాడు జైశ్వాల్. ఆపై నోబాల్, వైడ్, నోబాల్ ఫోర్ వచ్చాయి. చివరి మూడు బంతుల్లో 0, 4, 0 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఈ ఓవర్లో 23 రన్స్ వచ్చినట్లుయింది. ఫలితంగా భారత్.. అరుదైన రికార్డును నమోదు చేసింది.