
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోగా, ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పంజాగుట్ట, బేగంపేట్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, టోలిచౌకి వంటి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షం కారణంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ రోడ్లతో పాటు పంజాగుట్ట, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్ పరిధిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనదారులు వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. పరిస్థితిని సమీక్షించిన నగర పాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News