
Fixed-Dose Combination Medicines : దేశంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
చికిత్స పరంగా ఎలాంటి శాస్త్రీయ ఆధారం, సహేతుకత లేని 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, పంపిణీ మరియు అమ్మకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే మాత్ర లేదా సిరప్గా తయారుచేసే ఈ FDC మందులు రోగులలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ను (ఔషధ నిరోధకత) పెంచుతున్నాయని, వీటి వల్ల రోగులకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలోనే యాంటీబయాటిక్స్, కాస్మెటిక్స్, టాపికల్ (చర్మ పైపూత) విభాగానికి చెందిన ఈ 16 రకాల కాంబినేషన్ ఔషధాలపై తక్షణమే అమలులోకి వచ్చేలా కేంద్రం పూర్తి నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also ; మహారాష్ట్ర బీచ్‌లో విషాదం.. ఐదుగురు పర్యాటకులు మృతి!
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ జాబితాలో ప్రజలు సాధారణంగా ఉపయోగించే పలు కీలకమైన యాంటీబయాటిక్స్ మరియు నొప్పి నివారణ మందుల కాంబినేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా అమోక్సిసిలిన్ (Amoxicillin) కాంబినేషన్లు, పారాసిటమాల్ + లిగ్నోకైన్ (Paracetamol+Lignocaine), అలోవెరా + విటమిన్ ఇ + హెర్బల్ (Aloe vera+ Vitamin E+Herbal), సెఫురాక్సిమ్ + సెర్రాటియోపెప్టిడేస్ (Cefuroxime+ Serratiopeptidase), మరియు డైసైక్లోమైన్ + పారాసిటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ (Dicyclomine+ Paracetamol+ Clidinium Bromide) వంటి ప్రముఖ మెడిసిన్స్ ఈ నిషేధిత జాబితాలో చేరాయి. ఈ రకమైన అహేతుక కాంబినేషన్ల వల్ల రోగుల శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలు (Side effects) ఎదురవుతాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఫార్మా కంపెనీలు ఈ మందుల ఉత్పత్తిని నిలిపివేయడంతో పాటు, మార్కెట్ మరియు మెడికల్ షాపుల నుంచి వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవలసి ఉంటుంది.
Saikrishna : అసలు సాయికృష్ణ బతికున్నాడా ? చనిపోయాడా ? ప్రభుత్వానికి పేర్ని నాని డిమాండ్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Congress Fire on Modi : మోడీ.. మెలోనిని చూసి నేర్చుకో – కాంగ్రెస్
Parbhani Hanuman Temple Collapse: కూలిన హనుమాన్ ఆలయ మండపం.. శిథిలాలో 30 మంది భక్తులు?
IIT Bombay leopard attack: ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం
Ganpatipule Beach incident: మహారాష్ట్ర బీచ్‌లో విషాదం.. ఐదుగురు పర్యాటకులు మృతి!
India’s first 8-lane tunnel : పులుల సంరక్షణ కేంద్రం కింద భారతదేశపు మొట్టమొదటి 8-లేన్ల సొరంగం
Vivek Agarwal: తొలిసారిగా ఎఫ్ఏటీఎఫ్ (FATF) ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్!