ధీరజ్ కారుని ఫైనాన్షియర్ పట్టుకుని వెళ్లిపోవడంతో.. ఎలాగైనా సరే తన భర్త ధీరజ్‌కి కారుని కొనివ్వాలని అనుకుంటుంది ప్రేమ. దానికి దేవుడే ఏదొక దారి చూపిస్తాడని అనుకుంటుంది.
ఇంతలో ఆమె స్నేహితురాలు గీత ఫోన్ చేసి.. డాన్స్ కాంపిటేషన్ ఉంది.. అందులో పార్టిసిపేట్ చేస్తే రూ.10 లక్షలు ప్రైజ్ మనీ వస్తుందని చెప్తుంది. అయితే ధీరజ్‌కి చెప్పకుండానే ఆ డాన్స్ కాంపిటేషన్‌కి అప్లై చేస్తుంది ప్రేమ. ఎలాగైనా సరే అందులో గెలిచి.. ప్రైజ్ మనీ సంపాదించి.. దాంతో ధీరజ్‌కి కారుని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటుంది ప్రేమ. అయితే ఆ డాన్స్ కాంపిటేషన్ నిర్వహించే రాజపుష్పం.. అమ్మాయిలకు వలవేసి లోబరుచుకోవడంలో భాగంగానే ఈ ప్లాన్ వేస్తాడు. సిటీలో కాకుండా పల్లెటూళ్లలో అందమైన అమ్మాయిలు ఉంటారని.. వాళ్లని అనుభవించాలనే కోరికతో ఈ కుట్ర చేస్తాడు. అయితే నేటి ఎపిసోడ్లో రాజపుష్పం.. కంట్లో పడింది ప్రేమ. డాన్స్ కాంపిటేషన్ కోసం చాలామంది ఫొటోలు పంపిస్తారు కానీ.. అవేవీ రాజపుష్పానికి నచ్చవు. దాంతో రగిలిపోతూ ఉంటాడు. ‘ఏ ఫొటో చూసినా కూడా కిక్ ఇవ్వడం లేదు.. గుండెల్లో గుచ్చుకోవడం లేదు. అందం అనే పదానికి పర్యాయపదం ఆడవాళ్లే కదా.. మరి ఈ భూమి మీద అందం అంతరించుకుపోవడం ఏంటి? వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అంటూ తెగ ఫీల్ అయిపోతుంటాడు రాజపుష్పం .ఇంతలో అతని అసిస్టెంట్ వచ్చి.. ‘సార్ మీరు చెప్పినట్టే విలేజ్లలోనూ చిన్న చిన్న టౌన్స్లలోనూ డాన్స్ కాంపిటేషన్ గురించి పోస్టర్లు వేశాం సార్.. కొన్ని ఫొటోలు కూడా వచ్చాయి.. చూడండి సార్’ అని ఫొటోలను ఇస్తాడు. అంతులో ప్రేమ ఫొటోని చూసి మైమరచిపోతాడు రాజపుష్పం. ఈ పిల్ల ఎవర్రా.. గుంటూరు కారంలా ఇంత ఘాటుగా ఉందీ.. దీని ఫొటో చూస్తేనే గుండె బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్‌గా పరుగుపెడుతుంది అని అంటాడు రాజపుష్పం. ఆ అమ్మాయి అందంలోనే కాదు సార్.. టాలెంట్‌లో అంతకంటే. ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ ప్రేమ డాన్స్ వీడియోను చూపిస్తాడు. ఆ వీడియో చూసి పిచ్చెక్కిపోతుంటాడు రాజపుష్పం. ‘మనకి కావాల్సింది పెర్ఫామెన్స్ కాదు.. ముందు ఆమెను డాన్స్ కాంపిటేషన్‌కి సెలెక్ట్ అయ్యిందని రమ్మని చెప్పండి. ఆ తరువాత వేయాల్సిన స్టెప్లు నేను వేస్తాను’ అని కామంతో కటకటలాడిపోతుంటాడు రాజపుష్పం. అయితే ప్రేమ ఏ పని చేసినా కూడా ధీరజ్‌కి చెప్పకుండానే చేస్తుంది.. ఆ తరువాత తాను ఇబ్బందుల్లో పడి.. రామరాజు కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటుంది. గతంలో ఆమె రెస్టారెంట్లో పనిచేస్తున్నప్పుడూ.. డాన్స్ స్కూల్‌కి వెళ్తున్నప్పుడూ.. హోమ్ ట్యూషన్స్ పెట్టినప్పుడూ.. ఇలా ఏ విషయాన్ని కూడా కట్టుకున్న మొగుడుకి చెప్పిన పాపానపోలేదు. ఇప్పుడు మళ్లీ ధీరజ్‌కి చెప్పకుండానే.. పది లక్షలు సంపాదించేసి.. కారు కొనేయాలని చూస్తుంది. అయితే ఆ రాజపుష్పం గాడు ప్రేమకి వలవేసి ఆమెనే కాదు.. మొత్తం రామరాజు ఫ్యామిలీనే ఇబ్బందుల పాలు చేయబోతున్నాడన్నమాట.