
నంద్యాల: జిల్లాలోని డోన్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం చోరీకి గురైంది. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
మోతీలాల్ అనే వ్యాపారి బంగారం తీసుకెళ్తుండగా దాబా దగ్గర బస్సు ఆపినప్పుడు చోరీ జరిగింది. జడ్చర్ల దాటాక మోతీలాల్ ఈ విషయాన్ని గుర్తించారు. దీనిపై డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో 2 కిలోల బంగారం చోరీ |