
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్తో మూడో వన్డే కోసం భారత్ మూడు మార్పులు చేసింది. అయితే, హర్షిత్ రాణాకు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చివరి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డికి టీమ్ఇండియా అవకాశం ఇచ్చింది. అఫ్గాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్
అఫ్గానిస్థాన్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), డార్విష్ రసూలి, మహ్మద్ నబి, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఘజన్ఫర్, రహ్మాన్ షారిఫి, ఫరీద్ అహ్మద్ మాలిక్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.