
దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌లో నాగ్‌పూర్‌కు చెంది
న విద్యార్థికి ఏకంగా యూఏఈలోని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రేపే ఈ పరీక్ష ఉండడంతో విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థి నీట్ రీ-ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్లికేషన్ ఫారంలో తన ప్రాధాన్యత కేంద్రాలుగా నాగ్‌పూర్, వార్థా, భండారా నగరాలను ఎంచుకున్నాడు. అయితే, ఎన్టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డు చూసి అబ్దుల్లా కుటుంబం నివ్వెరపోయింది. తన నివాసానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయించబడి ఉండటమే దీనికి కారణం.ఈ ఘటనపై 'ఆజ్ తక్'తో మాట్లాడిన విద్యార్థి తండ్రి, తాము ఎంతో జాగ్రత్తగా నాగ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాలనే కేంద్రాలుగా ఎంచుకున్నామని, కానీ విదేశాల్లో సెంటర్ ఎలా కేటాయించారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆ విద్యార్థికి పాస్‌పోర్ట్ కూడా లేదు. పరీక్షకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పాస్‌పోర్ట్, వీసా వంటివి పూర్తిచేసి విదేశాలకు వెళ్లడం అసాధ్యమని కుటుంబ సభ్యులు వాపోయారు.రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ పరీక్షల నిర్వహణను ఒక అపహాస్యంగా మార్చిందని ఆయన విమర్శించారు. ఆజ్ తక్‌తో