
SBI తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహించింది. ప్రభుత్వ డిపాజిట్లు అన్నీ ఉపసంహరించే ఆలోచన. లీడ్ బ్యాంక్ హోదాను తొలగించే యోచన.
Rayadurgam Land Auction: హైరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఇటీవల నిర్వహించిన భూముల వేలం(Rayadurgam Land Auction) తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వేలంలో ఎకరానికి రికార్డు స్థాయిలో రూ. 237 కోట్ల ధర పలికింది. అయితే, వేలం ప్రక్రియ అంతా సజావుగా ముగిసిన తర్వాత, సదరు భూములు తమవేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకస్మాత్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. Annadata Sukhibhava Scheme: నేడే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు ప్రభుత్వ నిధుల ఉపసంహరణకు ఆదేశాలు: ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఎస్బీఐపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల ఉన్నతాధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ అధికారిక ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల (FDs) పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే మెజారిటీ శాఖల నుంచి ఈ వివరాలు ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. ఈ నిధులన్నింటినీ ఎస్బీఐ నుంచి పూర్తిగా ఉపసంహరించి, మరో బ్యాంకుకు బదిలీ చేయాలని సర్కారు యోచిస్తోంది. 'లీడ్ బ్యాంకు' హోదా తొలగింపు యోచన: కేవలం నిధుల బదిలీతోనే ఆగకుండా, రాష్ట్రంలో ఎస్బీఐకి ఉన్న ‘లీడ్ బ్యాంకు’ (Lead Bank) హోదాను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ప్రభుత్వ భూముల వేలానికి అడ్డుతగిలేలా వ్యవహరించినందుకు బ్యాంకుకు ఈ రకమైన షాక్ ఇవ్వాలని చూస్తోంది. అదే జరిగితే ఎస్బీఐకి రాష్ట్రంలో భారీ ఆర్థిక, ప్రతిష్టాత్మక నష్టం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.