
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. జూన్ 20వ తేదీ భారత కమోడిటీ మార్కెట్లో బంగారం ధర రూ. 1, 47,530 కి పడిపోయింది. భారత కమోడిటీ మార్కెట్లో శుక్రవారం వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా పడిపోయాయి. నేడు జూన్ 20వ తేదీ శనివారం కూడా అదే ధోరణ కొనసాగింది. ఈ కాలంలో బంగారం ధరలు 2శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 1.68శాతం తగ్గి రూ. 1,46,800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు భారీగా పెరిగి జనవరిలో 10 గ్రాములకు రూ. 1.91 లక్షలకు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు తన సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ తగ్గుదల ప్రారంభమైంది. ఈ ఏడాది వడ్డీ రేట్లను మళ్లీ పెంచే అవకాశం ఉందని కూడా సూచించింది. దీంతో బంగారంతోపాటు వెండి ప్రపంచ స్టాక్ మార్కెట్ పైనా ఒత్తిడి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ముప్పు కూడా బంగారం, వెండి అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. అయితే బంగారం ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఈ తగ్గుదల భారీ ఊరట కలిగించింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ లో ఎంసీఎక్స్ లో బంగారం, వెండి రెండింటిలోనూ భారీ అమ్మకాలు జరిగాయి. రెండు రోజుల్లో బంగారం ధర రూ. 7000 రూపాయలకుపైగా పడిపోయింది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఈ భారీ తగ్గుదల పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారికి ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశం అవుతుందని చెబుతున్నారు. అయితే స్వల్పకాలిక వ్యాపారులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఫెడ్ కఠిన వైఖరి రాబోయే రోజుల్లో మార్కెట్ లో మరికొంత అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే బదులు వాయిదాల్లో కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. శుక్రవారం ఒక దెబ్బతో వెండి ధర కిలోకు దాదాపు 9000 మేర పడిపోయింది. అంతుకు ముందు గురువారం వెండి ధరలు కిలో కు దాదాపు 13000 మేర తగ్గాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్ లో వెండి ధరలు 2,13,600కు పడిపోయింది. ట్రేడింగ్ సమయంలో ధర కిలోకు రూ. 2,28,162కు తగ్గింది. వెండి ధర కూడా దాని సర్వకాలీక గరిష్ఠ స్థాయి నుంచి కిలోకు సుమారు 1.90లక్షలకు తగ్గింది. ఈ సంవత్సరంలో ప్రారంభంలో వెండి ధర కిలోకు రూ. 4.21 లక్షలకు పెరిగింది. కేవలం 4 నుంచి 5 నెలల్లోనే ఇది కిలోకు 2.30లక్షలకు పడిపోయింది. గత రెండు రోజుల్లోనే వెండి ధర రూ. 22,000 పైగా తగ్గింది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.