
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Annadata Sukhibava Status Check: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఒక గొప్ప శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా లింగలగుంట్ల వద్ద అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతులకు ఒక్కొక్కరికి రూ.7,000 చొప్పున జమ చేయనున్నారు. దీని ద్వారా 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం విడుదలయ్యే రూ.3,125.47 కోట్ల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ మొత్తాన్ని (అన్నదాత సుఖీభవ ,పీఎం కిసాన్ కలిపి) రైతుల ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పెట్టుబడుల కోసం మంజూరు చేస్తున్నారు. అనంతరం రబీ సీజన్ సమయంలో కూడా మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి రైతులకు మొత్తం రూ.20,000 రెండు విడతలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్-బ్యాంక్ సీడింగ్ , కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. అలాగే సరైన భూ రికార్డులు కూడా ఉండాలి. కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిధులు మీ ఖాతాలో జమ అయ్యాయో లేదో ఆన్లైన్లోనే స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకునే విధానం: ఆంధ్రప్రదేశ్ రైతులు అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి తమ ఖాతాలో నిధులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. అక్కడ కనిపించే 'చెక్ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్, లబ్ధిదారుల జాబితా మరియు పేమెంట్ వివరాలన్నీ పూర్తిగా తెలుస్తాయి.
ఒకవేళ అన్నదాత సుఖీభవ డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే, వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్లి సంప్రదించాలి. వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్, సరైన భూ రికార్డులు, భూమికి అనుసంధానించబడిన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లాలి. దీనివల్ల మీ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించాలంటే, ఆదాయపు పన్ను చెల్లించే వారు, పెద్ద మొత్తంలో వాణిజ్య ఆస్తులు లేదా కార్లు వంటి విలాసవంతమైన వస్తువులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. కేవలం నిబంధనలకు లోబడి ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు వర్తిస్తాయి. పీఎం కిసాన్ పొందాలన్నా కూడా కేవైసీ పూర్తి చేసి, బ్యాంకు ఖాతా సరిగ్గా ఉన్న వారికి మాత్రమే డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.