
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Spider Man Brand New Day Telugu Trailer Review: ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్‌గా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన తెలుగు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ఈ మూవీ నుంచి మరో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ రకంగా ఈ సినిమా పబ్లిసిటీనీ పీక్స్‌లో చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది.
ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్లో పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకున్న కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే సరికొత్త సవాళ్లు ప్రేక్షకులను ఉత్కంఠ రేకిత్తించనున్నాయి. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ఘటనల అనంతరం ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మరిచిపోయిన పరిస్థితుల్లో, అతను మరోసారి తన బాధ్యతలను ఎలా స్వీకరించాడనే అంశం కథలో ప్రధానంగా కనిపించబోతుంది.
అదే సమయంలో జెండయా పోషించిన ఎంజే (MJ)తో పీటర్‌కు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని కూడా ట్రైలర్ హైలైట్ చేసింది. భారీ యాక్షన్ సీన్స్.. ఊహించని ట్విస్టులు, మరింత శక్తివంతమైన విలన్లతో ఈ చిత్రం సూపర్ హీరో అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
‘బ్రాండ్ న్యూ డే’ కథలో పీటర్ పార్కర్ పూర్తిస్థాయిలో స్పైడర్-మ్యాన్‌గా నేరస్తులతో పోరాడుతూనే, తన గత జీవితాన్ని కోల్పోయిన బాధను మోస్తుంటాడు. తన స్నేహితులు, తనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు తనను గుర్తుపట్టకపోవడం అతని జీవితంలో కీలకమైన మార్పులకు దారి ఎలా దారి తీసిందనే అంశం ప్రేక్షకులను సీట్లలో కూర్చొబెట్టనుంది.
అయితే అదే మార్పు నగరాన్ని, తన ప్రియమైన వారిని రక్షించడానికి అవసరమైన శక్తిగా మారుతుందా? అనేది చిత్రంలో ప్రధాన ఆసక్తికర అంశంగా నిలవనుంది. ముఖ్యంగా ఎవరూ చూడలేని ఓ కొత్త శక్తివంతమైన విలన్‌ను స్పైడర్-మ్యాన్ ఎలా ఎదుర్కొంటాడనేది చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
డెస్టిన్ డానియెల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్, జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో ఒకటైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’కు భారత్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ చిత్ర విడుదల తేదీని ఒక రోజు ప్రీ పోన్ చేశారు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్.
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ఈ చిత్రాన్ని జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనుంది. 2D, 3D, 4DX 3D, ScreenX, Dolby Cinema, MX4D, P[XL], BIGPIX తదితర ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.