
కుర్ర హీరో విరాట్ కర్ణ(Virat Karna), నభా నటేష్ (Nabha Natesh) జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-మైథోలాజికల్ థ్రిల్లర్ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (Nagabhandam).
కుర్ర హీరో విరాట్ కర్ణ(Virat Karna), నభా నటేష్ (Nabha Natesh) జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-మైథోలాజికల్ థ్రిల్లర్ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (Nagabhandam). ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
నాగబంధం సినిమా కథ మొత్తం కొన్ని వందల ఏళ్ల నాటి ఒక ప్రాచీన రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన, దైవిక మహిమలు గల బ్రహ్మకమలం ఒక రహస్య ప్రదేశంలో దాచబడి ఉంటుంది. దానికి నాగసాధువులు రక్షణ కవచంగా ఉంటారు. దురాశతో ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని చూసే విలన్ల ముఠా ఒకవైపు.. ఆ రహస్యాన్ని ఛేదించి, దైవ నిధిని రక్షించడానికి హీరో ఒకవైపు. చివరికి బ్రహ్మకమలం ఎవరి చేతికి వెళ్ళింది.. ? అసలు దానికి ఉన్న శక్తులు ఏంటి.. ? దానికి నాగబంధనం వేసింది ఎవరు.. ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ లోని ప్రతి విజువల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ప్రారంభంలోనే దట్టమైన అడవులు, ఎవరూ వెళ్లలేని లోయలు, ఒక పురాతనమైన భారీ నల్లరాతి కోటను చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఓవర్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేస్తుంది. ముఖ్యంగా ఆ దైవ నిధికి రక్షణగా ఉండే నల్లటి భారీ పాములు ఒక విజువల్ ఎఫెక్ట్ సీన్ చాలా రా అండ్ రస్టిక్ గా, భయపెట్టేలా ఉన్నాయి. గ్రాఫిక్స్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక చివర్లో వచ్చే హై-వోల్టేజ్ క్లైమాక్స్ షాట్, విరాట్ కర్ణ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రధాన బలం జునైద్ కుమార్ మ్యూజిక్. ట్రైలర్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఈ ట్రైలర్ కట్ కూడా చలా అద్బుతంగా చేశారు. అసలు ఇది కదా ట్రైలర్ అంటే అని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. జులై 3 న నాగబంధం ప్రేక్షకుల ముందకు రానుంది. మరి ఈ సినిమాతో విరాట్ కర్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.