
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.50.73కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.
అందులో రూ.36.65కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.14.08కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను రేవంత్ ప్రారంభించారు.
రూ.10కోట్లతో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.10కోట్లతో సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియం ఆధునికీకరణకు కొబ్బరికాయ కొట్టారు. అలాగే రూ.4కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వలో మినీ స్టేడియం నిర్మాణానికి భూమిపూజ చేశారు.
రూ.4కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.50కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి, రూ.2.65కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మినీ స్టేడియాలకు భూమిపూజ చేశారు.
ప్రారంభం
రూ.5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ ప్రారంభం
రూ.35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ ప్రారంభం
రూ.35.94 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ ప్రారంభం
రూ.44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ ప్రారంభం
రూ.44.50 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ ప్రారంభం
రూ.58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్ బాల్ అకాడమీ ప్రారంభం
రూ.49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ అకాడమీ ప్రారంభం
కాగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు
నిజామాబాద్‌లో దారుణం.. రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రి..
రూ.2.50కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టారు సీఎం రేవంత్. రూ.5.70 కోట్లతో బాలికల కోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ