
భారత క్రికెట్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.జీఎంఆర్ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, 2027, 2028 సీజన్లకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్వీకరించనుంది.
ఈ నేపథ్యంలోనే కోచింగ్ బృందంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో (2025, 2026) ఢిల్లీ జట్టు వరుసగా ఐదు, ఆరో స్థానాలతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో, మెగా వేలానికి ముందు జట్టులో నూతనోత్తేజం నింపేందుకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అప్పటి నుంచి శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రిషభ్ పంత్ వంటి పలువురు యువ ఆటగాళ్లకు అనధికారికంగా మెంటార్‌గా వ్యవహరిస్తున్న యువీ, పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలవని ఢిల్లీ క్యాపిటల్స్, దిగ్గజాల సారథ్యంలో తమ తలరాతను మార్చుకోవాలని పట్టుదలగా ఉంది
.