
Asifabad couple murder: ఆసిఫాబాద్ మండలంలోని కోసరా గ్రామ పంచాయితీలో గల భవాని నగర్ తాండలో భార్యభర్తల హత్య బుధవారం రాత్రి సంఘటన చోటుచేసుకున్నట్లు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేర్కొనడం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బానోత్ రాజునాయక్ (50), సుశీల (45) బుధవారం రాత్రి ఇంటి ముందట పడుకున్న చోట హత్యకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. గతంలో కోసరాలో పీరిల ప్రతిమలు దొంగలించ బడ్డాయి. ఇదే సంఘటన పోలీస్ స్టేషన్లో సైతం కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే గ్రామస్తులు రాజునాయక్ చందాలతో ఈసారి పీరిల ప్రతిమలు చేయించి బుధవారం రోజున కోసరాలోని పీరిల బంగ్లాలో ప్రతి ష్టాపించడం జరిగింది.
గతంలో పీరిల ప్రతిమలు దొంగిలించిన ఆగంతకులు ఈసారి రాజునాయక్‌కు పీరిల దేవుడు రానుండడంతో ఆగంతకుల వివరాలు వెల్లడిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఈ ఆగంతకానికి పాల్పడినట్లు మృతుల బంధువులు తెలిపారు. పథకం ప్రకారమే భార్య భర్తలను హత్య చేసినట్లు వారు అన్నారు.
Read Also: Ramanthapur Gold Chain Snatching:రామంతపూర్‌లో దొంగతనం..ఫేస్‌వాష్ అడిగినట్లు నటించి చోరీ! బుధవారం రాత్రి పీరిల బంగ్లా పూజ అనంతరం రాజునాయక్ ఇంటి వద్ద హాలులో భార్యభర్తలు నిద్రలో ఉపక్రమించడంతో అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఈ ఆగంతకానికి పాల్పడినట్లు కుమారులు సైతం ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.
ఉదయం ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుమకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసును ఆసిఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
నటించి చోరీ!
Telangana activists welfare board: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
Telangana Land registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 3 రోజులు బంద్
PhonePe Wallet Charges: ఫోన్‌పే వాలెట్ వాడుతున్నారా? లేదంటే ₹100 కట్!
Janasena party hyderabad: హైదరాబాద్ వేదికగా నేడు జనసేన కొత్త ప్రస్థానం
Ramanthapur Gold Chain Snatching:రామంతపూర్‌లో దొంగతనం..ఫేస్‌వాష్ అడిగినట్లు