
Rahul Gandhi birthday: భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శిగా, యువతకు ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిలిచారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నగరం లోని గడియారం చౌరస్తా వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించి 56 ఫీట్ల బర్త్ డే కేకు ను ఆయన అనాద విద్యార్థులతో కలిసి కట్ చేసి విద్యార్థులకు తినిపించారు.
ఈ సందర్భంగా అనాధ విద్యార్థులకు కొత్త బట్టలను అందజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా దేశంలో కొనసాగుతున్న పాలనలో మధ్యతరగతి ప్రజల జీవితం కష్టాల్లోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ఆర్థిక పరిస్థితి బలహీనపడిందని, నిరుద్యోగం పెరిగిందని, సామాన్య ప్రజలపై భారం ఎక్కువైందని పేర్కొన్నారు. విదేశీ అప్పులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని కూడా అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా రాహుల్ గాంధీ ఎదిగారని వారు పేర్కొన్నారు.
పదవుల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేయాలని భావించే అరుదైన నాయకుడు ఆయన అని కొనియాడారు. రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ, వారి వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ, దేశ ప్రయోజనాలను ముందుకు ఉంచారని గుర్తుచేశారు.
Read Also: NEET-UG 2026: టెలిగ్రామ్ ద్వారా నకిలీ NEET-UG రీటెస్ట్ ప్రశ్నపత్రాలను విక్రయించిన విద్యార్థి అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునేందుకు ఆయన చేసిన పాదయాత్రలు, పోరాటాలు, ప్రజలతో కలిసిన విధానం ఆయన నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారేనని అన్నారు.
పెరుగుతోందని, ఆయనను భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడాలని కోట్లాదిమంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు. దేశానికి నూతన దిశను చూపగల నాయకత్వం రాహుల్ గాంధీ గారిదేనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామం నుంచి నగరం వరకు “గడప గడపకు కాంగ్రెస్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించేందుకు, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంకల్పమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, వినోద్ కుమార్, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయకుమార్, ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బుద్దారం సుధాకర్ రెడ్డి, సాయిబాబా, రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ సిజే బెనహర్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, ఉపాధ్యక్షులు సిరిగిరి మురళి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్, యువ నాయకులు, నగర కార్పొరేటర్లు, మహిళా నాయకులు,グラム అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Asifabad couple murder: దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..?
Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు!
Ramanthapur Gold Chain Snatching:రామంతపూర్‌లో దొంగతనం..ఫేస్‌వాష్ అడిగినట్లు నటించి చోరీ!
Telangana activists welfare board: తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
Telangana Land registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ 3 రోజులు బంద్
PhonePe Wallet Charges: ఫోన్‌పే వాలెట్ వాడుతున్నారా? లేదంటే ₹100 కట్!
ఈరోజు యువతలో ఆయనపై విశ్వాసం