
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై ఈ మధ్య సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరగడం, వారు చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాల విషయంలో లేనిపోని వార్తలను పుట్టించడం వెనుక బాలీవుడ్ మాఫియా ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్‌ని బాలీవుడ్ టార్గెట్ చేస్తుందా?
అంటే, జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల (Tollywood Star Heroes) సినిమాలపై ఈ మధ్య సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరగడం, వారు చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాల విషయంలో లేనిపోని వార్తలను పుట్టించడం వెనుక బాలీవుడ్ (Bollywood) మాఫియా ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్నాళ్లుగా బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగాలేదనే విషయం తెలియంది కాదు. ఒక్క హిట్ పడితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సినిమాలు వరసగా పరాజయాల బాట పట్టడంతో.. బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు కొత్తగా అక్కడి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదు.
హీరోలే నిర్మాతలుగా మారి సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అంటే అతిశయోక్తి కానే కాదు. అందులోనూ దక్షిణాది దర్శకులు బాలీవుడ్లో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టడం కూడా.. వారికి నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇటీవల జరిగిన సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె కాంట్రవర్సీ తర్వాత బాలీవుడ్లో భారీగా ఛేంజ్ కనిపిస్తోంది.
దక్షిణాది సినిమాలను మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమాల ఆదరణలో మార్పు కనిపిస్తోంది. అందుకు ఇటీవల వచ్చిన ‘పెద్ది’నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమాను ఆదరించకపోగా, ‘పెద్ది’ (Peddi)లోని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర విషయంలో ఆమెను విక్టిమ్గా చూపిస్తూ..
బాలీవుడ్లో ఎలాంటి హంగామా నడిచిందో తెలియంది కాదు. వాస్తవానికి ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రని బుచ్చిబాబు అంత నీచంగా ఏం చిత్రీకరించలేదు. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అక్కడి హీరోయిన్లు పోషించిన పాత్రల కంటే, కనిపించిన సన్నివేశాల కంటే..
బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన వారంతా కూడా ఇదే మాట చెబుతున్నారు. ఆఖరికి దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) క్షమాపణలు చెప్పినా కూడా ఇష్యూని ఇంకా ఇంకా లాగుతూనే ఉన్నారు.
‘యానిమల్’ సినిమా వచ్చినప్పుడు రణబీర్ కపూర్‌ని ఎవరూ టార్గెట్ చేయలేదు కానీ, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)ని మాత్రం తెగ ట్రోల్ చేశారు. భారీ స్థాయిలో డిబెట్లు కూడా నిర్వహించారు. ఇప్పుడాయన చేస్తున్న ‘స్పిరిట్’ సినిమానే కాకుండా ‘వారణాసి’ (Varanasi), ‘రాకా’ (Raaka), ‘డ్రాగన్’ (Dragon) సినిమాలపై కూడా ఆర్గనైజెడ్గా నెగిటివ్ ప్రచారం చేయిస్తుండటం చూస్తుంటే.. దీని వెనుక బాలీవుడ్ హస్తం లేదని చెప్పకుండా ఉండలేం?
తెలుగు ప్రేక్షకుల వీక్నెస్ని, కొన్ని పెయిడ్ సోషల్ మీడియా పేజెస్‌ను యూజ్ చేసుకుంటూ.. తెలుగు బిగ్ స్టార్స్ నటిస్తున్న సినిమాలపై కావాలని నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారనేలా.. విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ నెగిటివిటీని మన స్టార్స్ ఎలా తుత్తునీయలు చేస్తారో.. ఎలాంటి సక్సెస్‌లతో వారికి కొరడా ట్రీట్మెంట్ ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు
Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య
‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్ర వంద రెట్లు