
పట్టు చీరలు, ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కంచిపురం పట్టణం మరోసారి జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి అందుకు కారణం పూర్తిగా భిన్నమైనది. వివాహితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిస్క్రీట్ డేటింగ్ ప్లాట్ఫామ్ 'యాష్లే మ్యాడిసన్'లో కొత్తగా సైన్-అప్ అవుతున్న వారి సంఖ్యలో కంచిపురం వరుసగా రెండో ఏడాది కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఈ డేటింగ్ యాప్, వివాహ బంధంలో ఉంటూనే బయట రహస్య సంబంధాలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని సేవలు అందిస్తుండటం గమనార్హం. 2026 మే నాటి డేటా ప్రకారం ఈ నగరం మొదటి స్థానంలో ఉండగా, వరుసగా రెండో ఏడాది కూడా ఇదే స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.
గత వేసవిలోనూ ఈ యాప్లో చేరికలకు సంబంధించి కాంచీపురం టాప్లో నిలిచింది.ఈ జాబితాలో కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువళ్లూర్, చెన్నై వంటి నగరాలు ఉండటం గమనార్హం. దీంతో ఈ ప్లాట్ఫామ్ ర్యాంకింగ్స్లో దక్షిణాది నగరాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కేవలం నగరాల పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఇటువంటి రహస్య సంబంధాలపై భారతీయుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ యాప్లో సభ్యత్వ నమోదులో భారత్ గతేడాది 20 దేశాల్లో 8వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది.ఇలాంటి మరో డేటింగ్ ప్లాట్ఫామ్ 'గ్లీడెన్' కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్లో తమకు 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు ప్రకటించింది.
ఈ గణాంకాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న నగరాల్లోనూ ఈ ధోరణి