
ఒప్పో రెనో 16cలో 6.57-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ సెటప్, 50MP ప్రైమరీ కెమెరా, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ Oppo Reno 16c : ఒప్పో ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్లోకి ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది.
ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్ లాంచ్ చేయనుందో లేదో కంపెనీ వెల్లడించలేదు. ఈ లైనప్‌లో ఒప్పో రెనో 16C కొత్త మోడల్ కూడా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్ రెనో 16 సిరీస్‌లో (Oppo Reno 16c) సరసమైన ధరలో లభించనుంది.
రెనో 16F మాదిరిగానే స్పెసిఫికేషన్లు ఉంటాయని అంచనా.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. భారత్‌లో ఒప్పో రెనో 16C లాంచ్ : నివేదిక ప్రకారం.. ఒప్పో రెనో 16, రెనో 16C స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లో రిలీజ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఒప్పో రెనో 16 ఇప్పటికే అనేక సర్టిఫికేషన్లు, బెంచ్‌మార్క్ లిస్టులో కనిపించగా, రాబోయే లైనప్‌లో ఒప్పో రెనో 16C కొత్త మోడల్‌గా చేరనుంది. Read Also : Google Pixel 7 : ఏం డిస్కౌంట్ రా సామీ.. ఈ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ. 31వేలు తగ్గింపు..
ఇలా కొన్నారంటే? ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 15 సిరీస్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఒప్పో రెనో సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్‌గా ఒప్పో రెనో 15C మార్కెట్లోకి రాగా 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 34,999, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.
37,999గా ఉంది. ఒప్పో రెనో 16C స్పెసిఫికేషన్లు (అంచనా) : ఒప్పో రెనో 16Fతో పాటు రెనో 16c ఫోన్
స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్తో పాటు LPDDR5x ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటాయని అంచనా. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6,500mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్లో ప్లాస్టిక్ ఫ్రేమ్, స్టీరియో స్పీకర్లు, NFC సపోర్ట్ ఉంది. అలాగే, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ కూడా ఉంది.