
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Rajendranagar Snake Bite Video: సోషల్ మీడియా పిచ్చి.. రీల్స్ మోజు నేటి తరం యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతూ చేసిన ఒక పిచ్చి ప్రయత్రం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..
రీల్స్ కోసం ఏకంగా కింగ్ కోబ్రా పిల్లతో సాహసాలు చేయబోయిన ఓ యువకుడు, అది కాటేయడంతో కేవలం మూడు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన రాజేంద్రనగర్ పరిధిలో కలకలం రేపింది. రీల్స్ పిచ్చి.. స్థానికులతో పాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 248 పరిసర ప్రాంతంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసి అప్లోడ్ చేయాలనుకున్నాడు. అందుకోసం స్థానికంగా కనిపించిన ఒక చిన్న కోబ్రా పిల్లను పట్టుకున్నాడు. అది చిన్న పిల్ల కదా.. ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యంతో, చేతుల్లో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు రికార్డ్ చేయించుకున్నాడు..
మూడు గంటల్లోనే.. పాముతో ఆటలాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసి కాటు వేసింది. చిన్న పామే కదా అని మొదట లైట్ తీసుకున్నప్పటికీ...కొద్దిసేపటికే విషం శరీరం మొత్తం పాకడం మొదలైంది. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే, కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో.. కాటు వేసిన కేవలం మూడు గంటల సమయంలోనే ఆ యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.. ఈ వార్త తెలియడంతో యువకుడి
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానికుల ఆందోళన.. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ పిచ్చి ముదిరిపోతోందని.. నాలుగు లైకుల కోసం, వ్యూస్ కోసం బిల్డింగ్‌ల పైనుంచి దూకడం, బైక్ స్టంట్లు చేయడం, ఇప్పుడు ఇలా విషసర్పాలతో ఆటలాడటం చూస్తుంటే భయమేస్తోందఅని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు, విషసర్పాలతో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయోద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.