
Business Ideas: మీరు స్వంత వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలన్న మీ కలను సాకారం చేసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ అందించే వ్యాపారాల గురించి తెలుసుకుందాం. Business Ideas: రోజూ ఆఫీస్ లో బాస్ టార్చర్, వర్క్ ప్రెజర్ తో విసిగిపోయేవారు ఎంతో మంది ఉన్నారు.
అది చిన్న ఉద్యోగం, కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు.. ఒత్తిడి మాత్రం తప్పదు. ఎక్కువగా సాఫ్ట్ వేర్ రంగాల ఉద్యోగులే ఒత్తిడికి లోనవుతారని అనుకుంటారు. కానీ సాఫ్ట్ వేర్లే కాదు.. అందులో పనిచేసే ఆఫీస్ బాయ్ లకు కూడా టార్చర్లు తప్పవు.
అందుకే చాలా మంది యువత ఇప్పుడు ఉద్యోగాలకు స్వస్తి పలికి సొంతంగా వ్యాపారం పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే బాస్ టార్చర్ ఉండదు.. ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ బిజినెస్ లో రాణించాలంటే సొంత తెలివితేటలతో పాటు ఆకట్టుకునే గుణం ఉండాలి.
మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కేవలం రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షల లోపు పెట్టుబడితో మంచి లాభాలను అందించే టాప్ బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. 9 గంటల నుంచి 5గంటల ఉద్యోగాల గులాంగిరీకి గుడ్ బై చెప్పి సొంతంగా ఓనర్ అయి అద్రుష్టాన్ని మార్చుకోవాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ బిజినెస్ ఐడియాలు చక్కటి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పాలి.
కేఫ్‌లు: చాలా మంది యువత కేఫ్ లకు వెళ్లేది స్నాక్స్, టీ తాగేందుకే కాకుండా అక్కడి ప్రశాంతమైన వాతావరణం కోసం వెళ్తుంటారు. అందుకే యువతలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది. మీరు ఈ బిజినెస్ ను రూ. 10లక్షలతో అద్భుతమైన ఇంటీరియర్, బెస్ట్ సర్వీస్ తో ప్రారంభించవచ్చు.
ఎందుకంటే కేఫ్ కు వచ్చేవారికి ఇంటీరియర్, టేస్టీ ఫుడ్, సర్వీస్ నచ్చినట్లయితే.. మళ్లీ మళ్లీ వస్తుంటారు. పాథాలజీ ల్యాబ్: ఆరోగ్యం సంరక్షణ సేవల అవసరం ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా
ఒక ప్రముఖ బాండ్ నుంచి ఫ్రాంచైజీని తీసుకుని.. పాథాలజీ ల్యాబ్ ను ప్రారంభించవచ్చు. 5 లక్షల పెట్టుబడి సరిపోతుంది. బ్రాండ్ పేరు, వినియోగదారుల నమ్మకాన్ని పెంచడంలో సహాపడుతుంది. అంతేకాదు నష్టాలు వస్తాయన్న భయాన్ని కూడా తగ్గిస్తుంది.
మినీ సూపర్ మార్కెట్: ఈ రోజుల్లో ప్రతిఊరులోనూ సూపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి. మీరు కూడా ఒక చిన్న కిరాణ దుకాణం ప్రారంభించాలనుకుంటే కేవలం రూ. 10లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. దుకాణం పెట్టేందుకు కావాల్సిన గదికి అడ్వాన్స్, ర్యాక్ లు, బిల్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తక్కువే పెట్టుబడి అవుతుంది. రద్దీ ప్రాంతాల్లో దుకాణం ఏర్పాటు చేసి హై క్వాలిటీ సరుకులను అందించినట్లయితే మీకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించిపెడుతుంది.
జిమ్: ఈ రోజుల్లో ప్రజలకు ఆరోగ్యం, ఫిట్నెస్ పై ఎక్కువ ఆసక్తి కలుగుతోంది. జిమ్, యోగా, ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించాలనుకుంటే రూ. 10లక్షల బడ్జెట్ తోపాటు మంచి పరికరాలు, సౌకర్యాలతో దీన్ని ప్రారంభించవచ్చు.
ఆర్ఓ ప్లాంట్ వ్యాపారం: మనందరికీ స్వచ్ఛమైన నీరు అవసరం. ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇళ్లకు, కార్యాలయాలకు, హోటళ్లకు లేదా వివాహాలకు నీటిని సరఫరా చేయవచ్చు. ఈ వ్యాపారాన్ని సుమారు రూ. 1.50లక్షల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక నిర్వహణ కోసం మీకు లైసెన్స్ ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.