
Delhi doctor murder case: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సుమారు 15 ఏళ్లుగా తన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న ఒక మహిళను, ప్రముఖ వైద్యుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఢిల్లీలోని మౌంట్ కైలాష్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
50 ఏళ్ల చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మనీష్ గుప్తా, తన ఇంట్లో పనిచేస్తున్న మీనా (45) అనే మహిళను క్రికెట్ బ్యాట్‌తో బాది, కత్తితో పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Lohagad Fort : కాబోయే భార్యతో కలిసి ట్రెకింగ్‌కు వెళ్లిన యువకుడు.. 400 అడుగుల లోయలో పడి మృతి హత్యకు గురైన మీనా గత 15 ఏళ్లుగా మనీష్ ఇంట్లోనే నమ్మకంగా పనిమనిషిగా ఉంటోంది. గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో బట్టలు ఆరేసేందుకు ఆమె ఇంటి టెర్రస్‌పైకి వెళ్లగా, ఆమె వెనుకే వెళ్లిన డాక్టర్ మనీష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పొరుగువారు టెర్రస్‌పై రక్తపు మడుగులో పడి ఉన్న మీనా మృతదేహాన్ని గమనించి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, మృతదేహం పక్కనే నిందితుడైన డాక్టర్ మనీష్ కూర్చుని ఉన్నాడు.
పోలీసులను చూడగానే “నన్ను ఉరితీయండి” అని అతడు అరిచాడు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన క్రికెట్ బ్యాట్, కిచెన్ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో డాక్టర్ మనీష్ గత పదేళ్లుగా డిప్రెషన్ (Depression), అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.
ఈ మధ్యకాలంలో అతడు మందులు వాడటం నిలిపివేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలు మీనా తనపై చేతబడి చేసిందని, ఆమె వల్లే తన కుటుంబ ప్రశాంతత
, కొడుకు చదువు దెబ్బతిన్నాయని మనీష్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, పోలీసులు ఆ వాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
మీనాను పనిలోంచి తొలగించే విషయమై ఇటీవల డాక్టర్ మనీష్‌కు, ఆయన భార్యకు మధ్య తీవ్ర వివాదం జరిగినట్లు సమాచారం. గతంలో తన తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు మీనా చేసిన సేవలను గుర్తుచేస్తూ, ఆమెను పనిలోనే కొనసాగించాలని భార్య పట్టుబట్టింది. అయితే మానసిక భ్రాంతిలో ఉన్న మనీష్ దీన్ని సహించలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Alternative crops : ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం
Chhattisgarh Man Tortures : పిల్లల ముందే భార్యను కొట్టి, మూత్రం తాగించిన భర్త
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
CM V D Satheesan : మలబార్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టేడియం, కొచ్చికి ఫిల్మ్ సిటీ
Mekedatu Dam Project:మేకెదాటు డ్యామ్‌కు తమిళనాడు అసెంబ్లీ నో!
PhonePe Wallet Charges: ఫోన్‌పే వాలెట్ వాడుతున్నారా? లేదంటే ₹100 కట్!
Reliance AGM 2026: జియో IPOకి గ్రీన్ సిగ్నల్..ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!