
సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులు తమకు మంచి జరగాలని, ఉద్యోగం రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని కోరుకుంటారు. కానీ, ఓ మహిళ మాత్రం తన అత్త చనిపోవాలని దేవుడికి మొరపెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన కోరికను కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేసిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
హుండీ లెక్కింపు సందర్భంగా ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు నిర్ఘాంతపోయారు.వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. తాజాగా ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో వారికి కొన్ని 20 రూపాయల నోట్లు కనిపించాయి. వాటిపై రాసి ఉన్న రాతలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఓ నోటుపై "స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. తొందరగా మా అత్త చనిపోయేలా చూడు" అని రాసి ఉండగా, మరో నోటుపై "స్వామీ..
మా అత్త త్వరగా చనిపోవాలి" అని రాసి ఉంది.ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. అత్తగారి మరణాన్ని కోరుతూ ఓ కోడలు ఏకంగా దేవుడికే మొక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబంలో అత్త పెట్టే హింసలు, వేధింపులు ఏ స్థాయికి చేరితే ఓ కోడలు ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, మానసిక ఒత్తిడితో ఆ మహిళ ఈ విధంగా దేవుడికి తన ఆవేదనను తెలియజేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదుఆలయాల హుండీలను ప్రజలు కేవలం