
Satyavedu Sub Jail closed:భద్రతా లోపాలే కారణమంటూ ఖైదీలను చిత్తూరుకు తరలింపు..? తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ సంస్థ దూరమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలు మంగళవారం నుంచి అధికారికంగా మూత పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జైలు భవనం శిథిలా వస్థకు చేరుకోవడం, పైకప్పు దెబ్బతినడం, ప్రహరీగోడలు పటిష్టంగా లేకపోవడం వంటి భద్రతా లోపాలను గుర్తించిన జైలు శాఖ ఉన్నతాధికారులు జైలును మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ఏడుగురు రిమాండ్ ఖైదీలను కట్టుదిట్టమైన భద్రతల మధ్య చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.
Read also: Srikalahasti news: శ్రీకాళహస్తిలో మహిళలకు 6.3 కోట్ల రుణాలు అందించిన సుధీర్ రెడ్డి ఇకపై సత్యవేడు, నాగలాపురం, వరదయ్యపాళెం, పిచ్చాటూరు మండలాల్లో నమోదయ్యే కేసుల్లో రిమాండ్కు వెళ్లే నిందితులను చిత్తూరుకు తరలించాల్సి ఉంటుంది. ఒక్క రిమాండ్ ఖైదీని చిత్తూరుకు తరలించాలన్నా కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది బందోబస్తుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సత్యవేడు సర్కిల్ పోలీసుశాఖకు ఇది మరింత భారంగా మారనుంది. సత్యవేడు సబ్ జైలు తొలగింపు గురించి గత రెండేళ్లుగా ప్రచారం జరిగినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు జైలు బలోపేతం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు వినిపి స్తున్నాయి.
AP Tobacco farmers: కిలో పొగాకు రూ.200కు తగ్గకూడదు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. AP Aqua Farmers: ఆక్వా ఫీడ్ ధర కేజీ రూ.4 తగ్గింపు Srikalahasti news: శ్రీకాళహస్తిలో మహిళలకు 6.3 కోట్ల రుణాలు అందించిన సుధీర్ రెడ్డి El Nino impact: ఎల్నినో దెబ్బ..
ఇడి విచారణ
New Ration Cards: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
భారత్లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం Jonnagiri Sand Mining: ఇసుక లూటీపై