
Bhadradri Incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న వైద్యుల నిర్లక్ష్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చాట్ల వనజ (20) అనే బాలింతతో పాటు ఆమె నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అయితే, ఈ కేసులో అంత్యక్రియల అనంతరం వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ నిజం బాధితురాలి కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. Read Also: El Nino impact: ఎల్నినో దెబ్బ.. భారత్లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం బాధిత కుటుంబ సభ్యులు వనజ అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత, చితి బూడిదను సేకరిస్తుండగా అక్కడ ఒక సర్జికల్ కత్తెర (వైద్యులు ఆపరేషన్లకు వాడే కత్తెర) లభ్యమైంది.
ప్రసవం చేసిన సమయంలో వైద్య సిబ్బంది కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసేశారని, దానివల్లే లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, రక్తస్రావమై వనజ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆధారంతో వారు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వనజకు పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో అక్కడి స్టాఫ్ నర్సే ప్రసవం చేయగా, పుట్టిన కాసేపటికే నవజాత శిశువు మృతి చెందింది. ఆ తర్వాత తల్లి వనజకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది.
ఈ ఘటన మీడియాలో సోషల్ మీడియాలో విసృతంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘోరానికి కారకులైన మిగిలిన సిబ్బందిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. El Nino impact: ఎల్నినో దెబ్బ.. భారత్లో
10 శాతం తగ్గనున్న వర్షపాతం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Rahul Gandhi Birthday: రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
New Ration Cards: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అప్లై చేసుకోండిలా
Gold Rate Today: నేటి బంగారం ధరలు.. 10 గ్రాములకు ఎంతంటే?
TG EAPCET 2026 Counselling: నేటి నుంచే తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి వివరాలు ఇవే!
Telangana Rain Update: మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన