
మేడ్చల్ జిల్లా, తుర్కపల్లి, మురహరిపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా, ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
.