తెలుగు చిత్రసీమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'అంతఃపురం', 'ఖడ్గం' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఆయన ఈ మధ్య కాలంలో సినిమాల వేగాన్ని కాస్త తగ్గించారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ.. తన కెరీర్‌తో పాటు, పరిశ్రమలోని వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచింపజేసే సంచలన విషయాలను పంచుకున్నారు.స్టార్డమ్తో పనిలేదు.. పాత్రే ముఖ్యం!సినిమాల్లో నటీనటుల ఎంపికపై కృష్ణవంశీ మాట్లాడుతూ..
తాను ఎప్పుడూ స్టార్ ఇమేజ్ ఉన్న నటులపై ఆధారపడి కథలు రాయనని స్పష్టం చేశారు. బ్రహ్మానందం లాంటి అగ్ర హాస్యనటులు లేదా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులను తన చిత్రాల్లోకి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణాలేవీ ఉండవని, కేవలం కథ డిమాండ్ చేసిన పాత్రకు వారు సరిపోతారనే నమ్మకంతోనే ఎంపిక చేసుకుంటానని చెప్పారు.
నటుడి స్టార్ హోదా కంటే కథలోని పాత్రే తనకు అత్యంత ప్రాధాన్యమని చెబుతూ.. దానికి ఉదాహరణగా 'గులాబి' సినిమాలో నటుడు జీవా పోషించిన విలన్ పాత్రను ఆయన ప్రస్తావించారు. ఆ పాత్రకు జీవా ప్రాణం పోశారని, కథకు సరిగ్గా సరిపోయారని వివరించారు.* చీరకట్టులో గంభీరంగా చందమామ..
బాలయ్య మూవీలో పవర్ఫుల్ రోల్ సినీ పరిశ్రమలో తరచూ వినిపించే వివాదాలు, వాటిని మీడియా చూపే విధానంపై కృష్ణవంశీ తనదైన శైలిలో స్పందించారు. "సినిమా రంగం అనేది ఒక పబ్లిక్ ప్రాపర్టీ. ఇక్కడి వారు నిత్యం భావోద్వేగాలను కొనుగోలు చేస్తూ, తిరిగి ప్రజలకు అమ్మే వ్యాపారంలో ఉంటారు.
అందుకే మిగిలిన రంగాల వారితో పోలిస్తే సినీ పరిశ్రమలోని వ్యక్తులు మానసికంగా అత్యంత సున్నితంగా ఉంటారు" అని విశ్లేషించారు. విజయం వచ్చినప్పుడు కొందరు దాన్ని తమ వ్యక్తిగత ప్రతిభగా భావించి అహంకారానికి లోనవుతారని, అపజయం ఎదురైనప్పుడు అంతే తీవ్రంగా స్పందిస్తారని చెప్పారు.
మధ్య జరిగిన వివాదాన్ని ఉదాహరణగా చూపుతూ.. మీడియా సంస్థలు తమ టీఆర్పీ రేటింగుల కోసం చిన్న విషయాలను కూడా పెద్దవిగా చూపిస్తాయని, కానీ వ్యక్తిగతంగా పరిశ్రమలోని వారు చాలా త్వరగానే ఆ విభేదాలను మర్చిపోయి ఒకటైపోతారని వెల్లడించారు.* టాలీవుడ్లో 'మురారి' బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్.. క్రేజీ మూవీతో సోనాలి బింద్రే రీ ఎంట్రీ!అంత్యక్రియలకు వెళ్లకపోవడం వెనుక పెద్ద తత్వశాస్త్రం!ఈ ఇంటర్వ్యూలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పరిశ్రమలో ఎంతో మంది ఆత్మీయులు మరణించినా వారి అంత్యక్రియలకు ఎందుకు హాజరుకాలేదనే అంశంపై కృష్ణవంశీ తనదైన శైలిలో స్పందించారు. ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ వంటి తనకెంతో సన్నిహితులైన నటులు కాలం చేసినప్పుడు గానీ, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి కుమారుడు మరణించినప్పుడు గానీ తాను వెళ్లలేదని ఆయన తెలిపారు. దీని వెనుక ఉన్న తన వ్యక్తిగత తత్వశాస్త్రాన్ని వివరిస్తూ.. "నాకు ఎంతో ఇష్టమైన, ఆత్మీయులైన వ్యక్తులను విగతజీవిగా, నిస్సహాయ స్థితిలో చూడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా మనసులో ఎప్పుడూ వారు నవ్వుతూ, ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉన్న జ్ఞాపకాలు మాత్రమే సజీవంగా ఉండాలని కోరుకుంటాను" అని భావోద్వేగానికి లోనయ్యారు. తాను అక్కడికి వెళ్లినా, వెళ్లకపోయినా చనిపోయిన ఆత్మలకు వచ్చే తేడా ఏమీ ఉండదని, కేవలం లోకం కోసం లేదా పది మంది చూస్తారనే ఉద్దేశంతో తనకు నమ్మకం లేని పనిని తాను ఎప్పటికీ చేయనని కృష్ణవంశీ తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నమ్మకమని, దీని విషయంలో తాను ఎవరి కోసమూ రాజీ పడబోనని ఆయన స్పష్టం చేశారు.
గతంలో దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్ రాజ్