గుండె కవాటాల్లో సమస్యలు ఉంటే అలసట తీవ్రంగా ఉంటుందని డాక్టర్ గోపి ఎ, సీనియర్ డైరెక్టర్, కార్డియాలజీ, ఫోర్టిస్ హాస్పిటల్, బెంగళూరు తెలిపారు. చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు. గుండె కవాటాల్లో సమస్యలు ఉన్నప్పుడు శ్వాసలో కూడా ఇబ్బందులు వస్తాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. బలహీనంగా కనిపిస్తారు. గుండె కవాటాల్లో సమస్యలు ఉన్నవారిలో పాదాలు, చీలమండల దగ్గర వాపు ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా పాదాల్లో వాపు కనిపిస్తే వైద్యుడ్ని కలవండి. గుండె కవాట వ్యాధులు ఉన్న రోగుల్లో ఛాతీ నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ఈ నొప్పి నిరంతరంగా ఉంటుంది. గుండె దడ కూడా పెరిగే అవకాశం ఉంది. ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం, ట్రాన్స్ఫ్యాట్ ఉన్న ఆహారాలు తినడం, ధూమపానం వల్ల గుండె కవాటాల సమస్యలు వస్తాయి. గుండె కవాట సమస్యలతో ఇబ్బంది పడే రోగుల్లో తల తిరగడం కూడా ఎక్కువగా ఉంటుంది.
బలహీనతతో పాటు తల తిరగడం కనిపిస్తే డాక్టర్ను కలవండి. గుండె కవాటాల సమస్యలు ఉన్నవారిలో హృదయ స్పందనలు క్రమరహితంగా ఉంటాయి. వేగంగా నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు తేడా గమనిస్తే వైద్యుడ్ని కలవండి. వయసు పెరిగే కొద్దీ గుండె కవాట వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటే కవాటాల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీ, షుగర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వల్ల గుండె కవాటాల్లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవాలి
.