
Maa Inti Bangaram OTT:సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి నంది
ని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఓ బేబీ తర్వాత మరోసారి సమంత-నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తొలి షోల నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీమియర్ షోలకు కూడా మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, సినిమా ఓటీటీ విడుదలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం టైటిల్ కార్డుల ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది.
థియేటర్లలో విడుదలైన తర్వాత సాధారణంగా నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో సినిమాలు ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో, మా ఇంటి బంగారం కూడా విడుదలైన నెల రోజుల తర్వాత జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారిక స్ట్రీమింగ్ తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సమంత నటన, నందిని రెడ్డి దర్శకత్వం, భావోద్వేగభరితమైన కథాంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.