
New Ration Cards: దేశంలోని పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3 కోట్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ విషయాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో అధికారికంగా వెల్లడించారు. పీడీఎస్ (PDS) జాబితా నుండి అర్హత లేని లబ్ధిదారులను తొలగించిన తర్వాత ఈ అవకాశం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Rythu Bharosa Update : ‘రైతు భరోసా’.. మొదట వారి ఖాతాల్లోకే!
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. కేంద్ర ఆహార శాఖ దేశవ్యాప్తంగా దాదాపు 8.51 కోట్ల అర్హత లేని లబ్ధిదారులను గుర్తించింది. వీరిలో చనిపోయిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ జాబితాను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించగా.. ఇప్పటివరకు రాష్ట్రాలు కలిసి 2.21 కోట్ల నకిలీ, అనర్హమైన రేషన్ కార్డులను తొలగించాయి. పీడీఎస్ వ్యవస్థలో తీసుకొచ్చిన డిజిటలైజేషన్ వల్లే ఈ పారదర్శకత సాధ్యమైందని మంత్రి వివరించారు.
ప్రస్తుతం దేశంలో మొత్తం 79 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ‘ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ (PMGKY) కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ లక్ష్యం 80 కోట్ల మందికి చేరువగా ఉంది. అనర్హుల తొలగింపు ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో కొత్తగా అర్హులైన పేదలను చేర్చుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల దాదాపు 3 కోట్ల మందికి కొత్త కార్డులు లభించనున్నాయి. ప్రస్తుతం 98.5 శాతం ఆహార ధాన్యాల పంపిణీ ఆధార్ నంబర్, ఈపీఓఎస్ మిషన్ల ద్వారానే జరుగుతోందని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
Telangana weather update: జూన్ 23 నుండి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్ష సూచన.. IMD
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Gold Rate Today: నేటి బంగారం ధరలు.. 10 గ్రాములకు ఎంతంటే?
US Visa : ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్ .. కానీ భారీ ఖర్చు!
Rahul Gandhi Birthday: రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PF Balance Check: PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 8.25% వడ్డీ జమ!
Indus Water : సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన.. !
Nara Lokesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్